వెల్దండ, జనవరి 11 : క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లంపల్లి జీపీ ఈదమ్మతండాలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను శనివారం వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు విజితారెడ్డి, దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీలు వెంకటయ్యగౌడ్, హైజాక్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్, నాయకులు అంజి, తిర్మల్‌రావు, హన్మం తు, నిరంజన్, నర్సింహ, యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, ఆనంద్ తదితరులు ఉన్నారు.