మక్తల్, నవంబర్ 27: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై మక్తల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాగనూర్ వెళ్తారని, విద్యార్థులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తారని అనుమానంతో మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఆయన్ని ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం ఆ నారాయణపేట జిల్లా కేంద్రానికి అటు నుంచి మ ద్దూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ మాగనూరు పా ఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి తీవ్ర అస్వస్థతకు గురై మక్తల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి వారి ఆరోగ్యం కుదుటపడే వరకు దవాఖానలోనే ఉండడం జరిగిందన్నా రు. బుధవారం మాగనూరుకు ఎక్కడ వెళ్తారో అని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ఆదేశాల మేరకు తెల్లవారు జామున అరెస్టు చేసి ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పుకుంటూ చివరకు మద్దూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును నొక్కాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. అరెస్టు చేసినంత మాత్రానా భయపడేది లేదని, విద్యార్థులకు మద్దతు గా ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మె ల్యే చిట్టెంతోపాటు బీఆర్ఎస్ నాయకులు చిన్నహనుమంతు, రాజుల ఆశిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహులుగౌడ్ను కూడా ముందస్తు అరెస్టు చేసి మక్తల్ నియోజకవర్గంలోని నర్వ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం అక్ర మ అరెస్టును నిరసిస్తూ మక్తల్‌తోపాటు అమరచింత మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. మక్తల్‌లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్ తరలించారు.