కొల్లాపూర్ రూరల్, మే 19 : కాంగ్రెస్ ప్రభుత్వం తరు గు పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని ఎన్మన్‌బెట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లో తరుగు పేరుతో ఐదు కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తీ స్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సోమవారం ఎన్మన్‌బెట్లలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇంత ముందుకు సంచికి 40 కేజీలకు 1500 గ్రాములు తీసేవారని ఇప్పుడు తరుగు పేరు తో 5 కేజీలు తీస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే ముం దు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయకుండా కాలయాపన చేస్తున్నదని, దీంతో రైతు లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వ పెద్దలు రైతులను ఓదార్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రభుత్వంలో రైతులను కన్నీరు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ సక్రమంగా అమలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతు ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐకేపీ ఇన్చార్జి స్వర్ణమ్మ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్‌రావు, భాస్కర్‌గౌడ్, సాయికృష్ణ , గోవింద్‌గౌడ్, ఆటో రాముడు, మీసాల కురుమ య్య, మంచాల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.