భూత్పూర్, సెప్టెంబర్15 : బీఆర్ఎస్ కార్యకర్త, పట్టణ పరిధిలోని రాందాస్ తండాకు చెందిన లక్ష్మణ్ తండ్రి రాములునాయక్ శ నివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విష యం తెలుసుకొని మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రా కతో ఒక్కసారిగా దుఃఖం ఆపుకోలేక విలపించారు. దీంతో ఆల సైతం కన్నీళ్లు పెట్టుకొన్నారు. కార్యక్రమంలో చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్ బాలకోటి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.