మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 25 : హైదరాబాద్‌లో గల బాలానగర్‌లోని ఎంటీఏఆర్ కంపెనీ కా ర్మిక విభాగానికి జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ ఎంపీ రఘనందన్‌రావుపై బీఆర్ఎస్ తరఫున శ్రీనివాస్‌గౌ డ్ పోటీ చేసి కార్మిక అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఎంటీఏఆర్ కంపెనీలో పనిచేసే 359మంది కార్మికులను ప ర్మినెంట్ చేసివారికి క్యాంటీన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్మికులకు బేసిక్ 30శాతం నుంచి 50శాతానికి పెంచామన్నారు.
తనపై నమ్మకం ఉంచి గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ కార్మికులకు ప్రతినిత్యం అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంటీఏఆర్ కంపెనీ, బీఆర్టీయూ యూనియన్ జనరల్ సెక్రెటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, సామయ్య, రాయుడుయాదవ్ ఉన్నారు.