పాలమూరు, ఆగస్టు 9 : ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా గ్రామ దేవత ఆశీర్వాదం ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలంలోని బొక్కలోనిపల్లిలో పోచమ్మ, నాగులు, బలిపీఠం, పోతురాజు, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపనలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మాధవరెడ్డి, యుగేందర్‌రెడ్డి, అశోక్, మారుతిగౌడ్ పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 9 : మండలంలోని కప్పెటలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే మధు సూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవా రం ప్రారంభించారు. ముందుగా అర్చకులు ప్రారంభ పూజ, ధ్వజస్తంభ, బొడ్రాయి ప్రతిష్ఠాపన పూజలు చేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వ రాజ్‌గౌడ్, మాజీ ఎంపీపీ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.