మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 30 : మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేశానని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చేసిన అ భివృద్ధిని ప్రజలకు చేప్పుకొలేకపోయామని.. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ రోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు నెరవేర్చడంలో విఫలమైందని, పక్కనున్న కర్ణాటకలో కూడా ఇలాగే కొనసాగుతుందని విమర్శించారు. గ్రా మాల్లో రైతుబంధు, పింఛన్లు అందడం లేదని, వ్యవసాయానికి పూర్తిస్థాయిలో కరెంటు రాక రైతులు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించలేదన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా నియోజకవర్గ ప్రజలకు రూ.30 కోట్లు అందించి ఆదుకున్నామని, మైనార్టీ పిల్లల చదువు కోసం రూ.120 కోట్లతో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. పేదల కోసం పట్టణంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయ ని ఇది రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రజలకు ఐ దేండ్లు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి చక్కటి సేవలు అం దించారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని, గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిచేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకోసం కష్టపడి పని చేసేవారికి భవిష్యత్తులో మంచి స్థాయి ఉంటుందన్న విషయా న్ని గుర్తించుకొని పనిచేయాలని సూచించారు. ప్రజల కష్టాలను కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని, రైతులు వ్యవసాయం వదిలేసి వలసల దారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిం దని, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని కమిటీల పేరుతో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. అంతకుముం దు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, ఎంపీపీ సుధా శ్రీ, హన్వాడ ఎంపీపీ బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మ న్ రెహమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కరుణాకర్‌గౌడ్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.