గద్వాల, డిసెంబర్ 29 : తిరుమలలో వెంకన్న దర్శనాల విషయంలో సెంటిమెంట్‌ను దెబ్బతీయొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ, ఏపీ అన్న తేడా లేకుం డా.. వివక్ష చూపకుండా అందరికీ సమానం గా దర్శనభాగ్యం కల్పించాలన్నారు. తెలంగాణ సిఫారస్ లేఖలను స్వీకరించాలని డి మాండ్ చేశారు. ఆదివారం జోగుళాంబ గ ద్వాల జిల్లా కేంద్రంలోని జములమ్మ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేత బా సు హన్మంత్ నాయుడు స్వగృహంలో మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే అన్నా రు.
తిరుమలలో మన రికమండ్ లెటర్లు తీసుకోవడం లేదని, ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రా ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి అన్నారు. గతంలో ఉన్న సంప్రదాయాలను ప్రస్తుతం కొనసాగించడం లేదన్నారు. గ తంలో మన నేతల సిఫారస్ లేఖలు అనుమతించే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం తీసుకోకపోవడంతో ఇక్కడి ప్రజాప్రతినిధులతోపా టు నాయకులు, ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. వెంకన్న స్వామి అందరి ఇష్టదైవమని, ఇక్కడున్న ప్రతి ఇంటిలో ఒకరి పేరు స్వామి పేరు ఉండేలా పెట్టుకుంటారని తెలిపారు. కానీ దర్శనాల విషయానికొస్తే మా త్రం వివక్ష చూపుతున్నారని వాపోయారు.
రాష్ట్ర ప్రజలకు, ప్రతినిధులకు గతంలో క ల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డి మాండ్ చేశారు. జోగుళాంబ దేవికి దసరా ఉ త్సవాల సమయంలో కర్నూల్ కలెక్టర్ ప ట్టు వస్ర్తాలు సమర్పిస్తారని, అలాగే తిరుమల బ్ర హ్మోత్సవాల సమయంలో గద్వాల నుంచి ప ట్టు పంచెలు నేచి సమర్పించడం ఆనవాయి తీ అన్నారు. ఆనవాయితీకి వ్యతిరేకంగా వ్య వహరిస్తే అది అందరికీ అరిష్టమన్నారు. ఇది నేను రాజకీయంగా మాట్లాడడం లేదని, భ క్తుల పక్షాన.. వారు పడుతున్న బాధలు.. పొందుతున్న ఆవేదనను మీ ముందు ఉంచుతున్నానని చెప్పారు.
తెలంగాణ-ఆంధ్రా నా యకులు అన్న తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన విధానం అమలు చేయాలన్నారు. ఎన్టీఆర్ గొప్ప నేత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కల్పించిన గొప్పవ్యక్తి అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ప్రతిష్టను కొందరు దిగజార్చడానికి యత్నిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అసెంబ్లీ నిర్మిస్తామని కొందరు మాట్లాడం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. మంచి వ్యక్తులను గౌరవించే సం స్కృతీ సంప్రదాయం తెలంగాణ ప్రజలదన్నారు. సమావేశంలో బాసు శ్యామల, రవిప్రకాశ్‌గౌడ్, కిషోర్, మోనేశ్, తిరుమల్, బీచుపల్లి, ఎస్.రాము, శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.