పాలమూరు, అక్టోబర్ 3 : జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ, బ్రహ్మణవాడలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం పూజలు చేశారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరా జ్, కౌన్సిలర్ కిశోర్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.