మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/మహబూబ్‌నగర్ అర్బన్ , సెప్టెంబర్ 18 : మేదరులు కళాత్మకంగా వెదురుతో తయారుచేసే వస్తువులన్నీ పర్యావరణహితమే అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రపంచ వె దురు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కేతేశ్వరస్వామి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మేదరుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో సంఘం భవనానికి స్థలంతోపాటు మేదరుల్లో అత్యంత పేదవారికి డబు ల్ బెడ్రూం ఇండ్లు కేటాయించామని తెలిపా రు. పదేండ్లలో మహబూబ్‌నగర్‌ను పూర్తి స్థా యిలో అభివృద్ధి చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
క్రిస్టియన్‌పల్లి సర్వే నెంబర్ 523 బాధితుల పక్షాన పోరాటం చేసినందుకు త ప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తా రు. పేదవారికి అండగా ఉంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు గణేశ్, రా ము, నాయకులు సాయిలు, శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్, భాస్కర్, కిషన్ పవర్, మేదరి సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటరాముడు, గౌరవ అధ్యక్షుడు రాజేందర్, పట్టణ అధ్యక్షుడు స త్యం, యువత అధ్యక్షుడు సుధాకర్, ఆంజనేయులు, రాములు పాల్గొన్నారు.