మహబూబ్‌నగర్ అర్బన్, మే 28 : హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయి న విషయం తెలిసిందే. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇ చ్చిన మాట మేరకు.. బుధవారం దుబాయికు వెళ్లిన ఆయన గోపాల్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం అక్కడ ఉన్న అడ్వకేట్, లీగల్ కన్సల్టెం ట్ బొబ్బిలిశెట్టి అనురాధతో సమావేశమయ్యారు. గో పాల్ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదివరకు నమోదైన కేసుతో మరో కేసు గో పాల్‌పై నమోదైనట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కేసు బెయిల్ వచ్చేలా కృషి చేయాలని న్యాయవాదిని కోరారు. అనంతరం గోపాల్ తల్లి, కుటుంబ సభ్యుల తో ఫోన్లో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడి వారికి ధైర్యమిచ్చారు. న్యాయపరంగా అవసరమైన చర్యలు తీసుకొని త్వరలోనే బెయిల్ వస్తుందని పేర్కొన్నారు. సమస్య ఉన్నదని చెప్పిన వెంటనే స్పందించి దుబాయికు వెళ్లినమాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు గోపాల్ బంధువు నర్సింహులు కృతజ్ఞతలు తెలిపాడు. శ్రీనివాస్‌గౌడ్ వెంట ప్రముఖ ఎన్ఆర్ఐ గుమ్మడాల శ్రీకాంత్ ఉన్నారు.