మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 6 : రైతు కోసం బీఆర్ఎస్ రణం మొదలుపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆర్థికం గా ఎదిగిన రైతు నేడు కాంగ్రెస్ హయాంలో కుదేలవుతుండడంతో తల్లడిల్లిపోతున్నది. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా టైంపాస్ చేస్తున్న రేవంత్ సర్కారుపై భగ్గుమన్నది. శనివారం ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్షలు చేపట్టింది. బీఆర్ఎస్ దండు కదిలిరాగా.. కర్షకులు తరలొచ్చారు. వరి కంకులను చేతబూని హస్తం పార్టీకి వ్యతిరేకంగా నినదించారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్చర్ల, దేవరకద్ర, అచ్చంపేట, నారాయణపేట, కల్వకుర్తి, మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎండిన పంటలకు ఎకరాకు రూ.25,000, ధాన్యం కొనుగోలుకు క్వింటాకు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.
నాలుగు నెలల్లోనే రాష్ట్రం ఎడారిగా మారిందని, రైతుల ఆత్మహత్యలే అందుకు నిదర్శనమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆ రోపించారు. పంట చేతికి రాక అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం మ హబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో రైతు సమస్యలపై ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పదేండ్లకు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఆవేదన వ్య క్తం చేశారు. కేసీఆర్ పాలనలో తాగునీటికి ఇబ్బందులు లేవని, ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నరు.. మళ్లీ బోర్లు వేసుకుంటున్నరు.. ఏ రైతును కదిలించినా కన్నీరే మిగిలిందన్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యా యి? రైతు భరోసా ఏమైంది? డిసెంబర్ 9న రుణమాఫీపై సంతకం చేసిన ఫైల్ ఎక్కడుందని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు.
ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లి అడిగితే ఏ ప్రభు త్వం బాగుండేదో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. మన్యంకొండ రోప్‌వే, పెద్ద చెరువు పనులను ఆపివేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ మన్నె మాట్లాడుతూ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఎండి న పంటలకు పరిహారం చెల్లించాలని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకట య్య, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహెమాన్, ఎంపీపీలు సుధాశ్రీ, బాలరాజు, నాయకులు గిరిధర్‌రెడ్డి, శివరాజ్ పాల్గొన్నారు.