మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 25 : ఈ నెల 29న నిర్వహించే దీక్షదివస్ను ఘనంగా ని ర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షదివస్కు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడతూ.. తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షను దీక్షదివాస్గా బీఆర్ఎస్ జరుపుకొంటుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కేసీఆర్ దీక్షకు దిగిరాక తప్పలేదని.. డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ వి వరించారు. మంగళవారం దీక్షదివస్కు సంబంధించి మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ క్యాడర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వెంట జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా మా జీ చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, జడ్చర్ల నాయకులు నాగిరెడ్డి, శ్రీ నివాస్‌రెడ్డి, అన్వర్, భాస్కర్ పాల్గొన్నారు.