వనపర్తి, డిసెంబర్ 14: మండలంలో ని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భరోసా కల్పించారు. జిల్లా కేం ద్రంలో బీఆర్ఎస్ కార్యాలయానికి గురువారం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేయడానికి తాను వెన్నం టే ఉంటానన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి గా పోరాడాలని పార్టీకి ద్రోహం చేసిన వారిని గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసేలా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు శంషోద్దీన్, చిమనగుంటపల్లి గ్రామ నాయకులు రామకృష్ణ, భగవంతు యాదవ్, మీడియా కన్వీనర్ అశోక్, కోళ్ల వెంకటేశ్, జాత్రు, శ్యామ్, విష్ణు, కౌన్సిలర్ పుట్టపాక మహేశ్ పాల్గొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించి ప్రోత్సహించామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిట్యాల శివారులోని ఓ రైతు పొలంలోని ఆయిల్ పాం తోటను గురువారం మా జీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ జిల్లాలో 14వేల ఎకరాల్లో ఆయిల్ సాగును తీసుకొచ్చా మన్నారు. మన రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతోనే రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో ప్రతి ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలోనే ఉంటూ మరింత సేవలందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో పాలకవర్గానికి ఉన్న అధికారాలను ఉపయోగించుకొని ప్రజలకు మరిన్ని సేవలందించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. నాతో ఉన్న వాళ్లకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన తాను వెన్నంటే ఉంటానని భరోసానిచ్చారు. ప్రజలు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎవ రూ అధైర్యపడవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, బం డారు కృష్ణ, నాగన్నయాదవ్, సమద్, మహేశ్, జం పన్న, బాషానాయక్, నాయకులు తిరుమల్, ప్రేమ్ నాథ్‌రెడ్డి, శ్యామ్, శరవంద, శేఖర్, రహీం, రమే శ్నా యక్, గోపాల్‌యాదవ్, కృష్ణ, శ్రీను, వినోద్ తదితరులు పాల్గొన్నారు.