మూసాపేట(అడ్డాకుల), మే 19 : మహబూబ్‌నగర్‌లోని బండమీదిపల్లి శివారులో ఉన్న శ్రీమల్లికార్జునవైన్స్ షాపు నిర్వాహకుల దాడిలో మృతి చెం దిన శ్రీకాంత్ తల్లిదండ్రులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. అడ్డాకుల మం డలంలోని బలీదుపల్లి గ్రామానికి ఆదివారం వెళ్లి శ్రీకాంత్ తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్ ను పరామర్శించి ధైర్యంగా ఉండాలన్నారు. శ్రీకాం త్ మృతికి కారణమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేవిధం గా న్యాయపరంగా తనవంతు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవస్థ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు.
తల్లిదండ్రుల ఒక్కగానొక్క కుమారుడిని కొట్టి చంపారని, ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పట్టించుకోకపోవడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. పుట్టెడు దుఃఖంలో తమ కుమారుడిని కొట్టి చంపిన వారిని శిక్షించి న్యాయం చేయండి అంటూ పోలీసు ల చుట్టూ రోజుల తరబడి తిరగడం ఎంత దౌర్భాగ్యమైన విషయం అన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాధితులకు అండగా నిలిచి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాజీ ఎంపీపీ దయాకర్, మండలాధ్యక్షుడు వేణు, సురేశ్, మహేశ్వర్‌రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
చేవెళ్ల డీసీపీ కిషన్ శ్రీకాంత్ తల్లిదండ్రులను ప రామర్శించారు. నిందితులకు తప్పకుండా శిక్షపడుతుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ జె డ్పీటీసీ రామన్‌గౌడ్, మాజీ సర్పంచ్ భీంరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.