మాట ఇచ్చారు.. విద్యార్థులతో మమేకమయ్యారు
వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో ఇటీవల సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించి కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించిన విషయం విధితమే..
- విద్యార్థులకు భోజనం వడ్డించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- విద్యపై ఇష్టం పెంచుకోవాలన్న సింగిరెడ్డి
వనపర్తి టౌన్, ఆగస్టు 11 : వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో ఇటీవల సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించి కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించిన విషయం విధితమే.. ఈ సందర్భంగా తాను స్వయంగా భోజనం తయారు చేయించి ఏర్పాటు చేస్తానన్న హామీ మేరకు మంగళవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యా యులు , అధికారులు విద్యతోపాటు క్రమశిక్షణ, సమాజంలోని పరిస్థితుల పై అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పరంగా నిర్వహించే విద్యా సంస్థల్లో పర్యటనలు చేస్తూ విద్యా వసతులు, మౌలిక వసతులు , ఆహార నాణ్యతమై శ్రద్ధపెట్టి మెరుగుపర్చాలని తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని అన్నారు.
విద్యార్థులను ఆహ్లాద పరిచిన మాజీ మంత్రి
భోజనం అనంతరం వి ద్యార్థిని విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి మనకు ఆ హారాన్ని అందించే రైతు, రైతు కూలీల విశిష్టత తెలిపి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులను, రైతులను గౌరవించాలని ఉద్భోందిచారు. అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చటించి ఉత్సాహపరిచారు. అనంతరం మాజీ మంత్రి వనపర్తి మండలం కిరియాతండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణనాయక్ ఇటీవల వెన్నెముక శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి ప రామర్శించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ నా యకులు మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మా ధవరెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, చిట్యాల రాము, కిష్టనాయక్, శంకర్‌నాయక్, సక్రూ నాయక్, పిరు నాయక్, సేనాపతి, శాంతమ్మ, దేవకుమార్, మహేశ్వర్‌రెడ్డి, నరేశ్, రాజు, యాదగిరి, వాసు, తిరుపతయ్య, స్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Food
- Niranjan Reddy
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

