Darjeeling | హనీమూన్ కోసం వెళ్లిన జంట.. యువతికి అంటుకున్న మంటలు.. అసలేం జరిగిందంటే
Darjeeling : మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన హనీమూన్ ఒక జంటకు తీవ్ర గాయంగా నిలిచింది. జంట బస చేసిన హోం స్టేలో యువతి అగ్ని ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలపాలైంది.
Darjeeling : మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన హనీమూన్ ఒక జంటకు తీవ్ర గాయంగా నిలిచింది. జంట బస చేసిన హోం స్టేలో యువతి అగ్ని ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలపాలైంది. ఆమె భర్తకు కూడా కాలిన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. పశ్చిమ బెంగాల్‌లోని చోప్రా ప్రాంతానికి చెందిన సమీర్ దాస్-నిఖిత అనే యువ జంట తమ హనీమూన్ కోసం కలింపోగ్ జిల్లాలోని పర్వత ప్రాంతంలోని సిటాంగ్లో ఉన్న ఒక ప్రైవేటు హోమ్ స్టేలో ఇటీవల బస చేశారు.
సెప్టెంబర్ 13న రాత్రి ఉన్న హోమ్ స్టేలో సేద తీరుతుండగా ఫైర్ బాల్లో మంటలు చెలరేగాయి. జంట ఒక టేబుల్ పక్కన కూర్చుని, అక్కడి ఫైర్బాల్లోని మంటతో సేదతీరారు. ఈ క్రమంలో సిబ్బంది ఒకరు ఆ మంటను మరింత పెంచేందుకు ఒక కెమికల్ ద్రావణాన్ని పోసేందుకు ప్రయత్నించాడు. ఆ మంటలో పడాల్సిన కెమికల్ కాస్తా.. అక్కడే ఉన్న నిఖితపై పడింది. దీంతో క్షణాల్లోనే ఆ యువతి ఒంటికి నిప్పంటుకుంది. ఈ మంటలు పెద్దగా అయ్యాయి. దీంతో ఆమె భర్త మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు.
🚨 NEWLYWED WOMAN CATCHES FIRE DURING BARBECUE IN WEST BENGAL
A newlywed woman was engulfed in flames during a barbecue session at a homestay in Sitong, Kalimpong, West Bengal, on September 13.
CCTV footage that has now surfaced shows a man appearing to pour liquid near the… pic.twitter.com/ahPMKrSAnc
— contentkikamii (@contentkikamii) September 18, 2026
కానీ, ఆ సమయంలో ఆమె మంటల్ని ఆర్పేందుకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. చివరకు ఆ భర్త తన టీషర్ట్ తీసి, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. చివరకు ఎలాగోలా భర్త, హోం స్టే స్టాఫ్ కలిసి మంటలను ఆర్పేశారు. అయితే, ఈలోపే నిఖితకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పే క్రమంలో ఆమె భర్త కూడా కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ అక్కడి సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఈ ఘటనపై నిఖిత భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్తానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోం స్టేలో అత్యవసర పరిస్తితిలో రక్షణ కోసం ఎలాంటి ఏర్పాట్లూ లేవని చెప్పాడు. కనీసం మంటలార్పే ఫైర్ ఎక్సిటింగ్విషర్ కూడా లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హోం స్టేపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మరోవైపు.. గాయాలపాలైన నిఖిత ఆరోగ్య పరిస్థితిపై తగిన సమాచారం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

