వనపర్తి, జూన్ 5 : తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో రంగారెడ్డి కృషి మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన రిటైర్ట్ చీఫ్ ఇంజినీర్ రంగారెడ్డి దశదిన కర్మ సంతాపసభలో మాజీ మంత్రి, రావుల పాల్గొని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు రైతుల భవిష్యత్తు కోసం లక్షలాది ఎకరాల కు శాశ్వత సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని, దాని అమలు, నిర్మాణానికి సలహాలు, సూచనలిస్తూ నిర్ణీత కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత రంగారెడ్డిదేనన్నారు. శాశ్వత తాగు, సాగునీటిని అం దించి ప్రజల మదిలో రంగారెడ్డి చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చే కూర్చి, వారి కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్ని అందించాలని కోరారు.