నాగర్‌కర్నూల్, నవంబర్ 13 : మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పేరును బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చే శారు. ప్రాజెక్టుల పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈ కంపెనీపై అభియోగాలు ఉన్నాయన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మేఘా కంపెనీ పనుల్లో అవినీతి జరిగిందంటూనే మళ్లీ అదే కంపెనీకి నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్యాకేజీ పనులు కట్టబెట్టడం ఏమిటన్నారు. ఇది ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రూ.5 వేల కోట్లకుపైగా ఈ కంపెనీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.
దోచుకున్నోడికే మళ్లీ దోచిపెట్టేందుకు ప్రాజెక్టులను అప్పగించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం హామీల ను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7వ తేదీలోగా ప్ర భుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై, గెలుపొందిన త ర్వాత నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని నా గం డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఏదో చేస్తారని రేవంత్ ఇక్కడి ప్రజలను నమ్మబలికారు.. కానీ ప్రాజెక్టుల విషయంలోనే మీ పనితనం బయటపడిందని విమర్శించారు. గత నెలలో కాగ్ నివేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినట్లు సదరు ఉత్తరాలను మీ డియాకు చూపించారు.
ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి ప్రజల సొమ్మును కాపాడేందుకు పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను గుర్తించడంలో, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుమ్మెత్తిపోశా రు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలో జరుగుతున్న అవినీతిని అరికట్టగలిగితే అమెరికా కన్నా అభివృద్ధిలో మన భారత్ ముందుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడే మన దేశానికి మంచిరోజులు వ స్తాయన్నారు. తాను ఏది మాట్లాడినా అవగాహనతో మా ట్లాడుతానని, తనతో అన్ని ఆధారాలు ఉంటాయని, సమాచారం ఉంటేనే మాట్లాడుతానని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అర్ధం రవి, లక్ష్మయ్య, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.