జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం బీఆర్టీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలను ( May Day celebrations) ఘనంగా నిర్వహించారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన మేడే వేడుకల్లో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి (Laxma Reddy) పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక, కర్షక, శ్రామికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. మే డే వేడుకల్లో మహిళా, హమాలీ కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తీగలపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన
నియోజకవర్గంలోని నవాబుపేట మండలం తీగలపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు గ్రామదేవతలే తమను కష్టనష్టాల నుంచి కాపాడతారన్న నమ్మకం ప్రజలు విశ్వసిస్తారని పేర్కొన్నారు.