జడ్చర్లటౌన్, మే 11 : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటనలో ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదై మూడురోజులు కావస్త్తున్న బండి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదైతే పేదలకు ఒక న్యాయం, అధికారం లో ఉన్న వారికి మరొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు.
కుమారుడిని రక్షించేందుకు బాధిత కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈఘటనపై హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో సహా ఇతర మంత్రులు స్పందించటంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఈ ఘటన నిదర్శనమన్నారు. న్యాయం కోసం బాధిత కుటుంబం మూడు నెలలుగా తిరుగుతుంటే కాంగ్రెస్ పాలనలో పట్టించుకునేవారు లేరని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బండి భగీరథ్‌ను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్, మే 11 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మైనర్‌పై లైంగిక దాడి నేపథ్యంలో పోక్సో కేసులో నిందితుడైన బండి సంజ య్ కుమారుడు భగీరథ్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ విషయంలో రే వంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. మైనర్ బాలికను లోబర్చుకొని, లైంగిక దాడికి పాల్పడిన భగీరథ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, ఉల్టా మైనర్ బాధిత కుటుంబాన్ని వేధించడం దుర్మార్గమన్నారు.
తక్షణమే పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. బండి భగీరథ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలని విమర్శించారు. బండి సంజయ్‌కి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. మే 8న సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే 5 గంటలపాటు ఫిర్యాదు తీసుకోలేదని, ఫిర్యాదు మార్చమన్నారని, ఆ కేసు వెనుక పెద్దలున్నారని పోలీసులు చెప్పడంపై రక్షణ భటుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థమవుతుందన్నారు.
చివరికి నిన్న జరిగిన ప్రధానమంత్రి సభలో ఆత్మహత్య చేసుకుంటానని చెబితే తప్పా అప్పుడు కేసు నమోదు చేశారన్నారు. బాధిత మైనర్‌పై కరీంనగర్లో కేసులు పెట్టారంటే ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత జరిగినా ఇప్పటివరకు పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట ఎందు కు స్టేట్మెంట్ రికార్డు చేయలేదని మర్రి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటు ంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని, తక్షణమే డీజీపీ స్థాయి అధికారి సమక్షంలో మెజిస్ట్రేట్ ఎదుట మైనర్ బాలిక, ఆమె తల్లి స్టేట్మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ముందస్తు బెయిల్ అంటూ డ్రామాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని మర్రి జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు.