జడ్చర్లటౌన్, జూలై10 : నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేయటం చేతగాక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో చేపడుతున్న 167వ జాతీయ రహదారి పనులను గురువారం మాజీ మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జడ్చర్లలో చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పాతబజార్ రహదారి ఇబ్బందిలేదని అధికారులే చెబుతుంటే మరోవైపు పాతబజార్‌కు రోడ్డు ఉండదని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించడం సరికాదన్నారు.
ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాల్సిన ఎమ్మెల్యే ప్రజలకు తలనొప్పిగా మారడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షపార్టీ నాయకులపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే తాను వేసిన ప్రశ్నలకు మొదటగా సమాధానమివ్వాలని సూచించారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన రంగారెడ్డిగూడలో ఎండోమెంట్ భూముల వివరాలను తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. జాతీయరహదారి విస్తరణ పనుల్లో జడ్చర్లలో బాధితులకు నష్టపరిహారం రాలేదని ఆరోపించిన ఎమ్మెల్యే మొదటగా కోదాడ నుంచి జడ్చర్ల వరకు జాతీయరహదారి విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఎక్కడ వచ్చిందో చూపించాలని డిమాండ్ చేశారు.
బాలానగర్-గంగాపూర్ రోడ్డు వేసినట్లు చెప్పుకొంటున్న ఎమ్మెల్యే ఏమైనా జీవో కాపీ ఉంటే చూయించాలన్నారు. తన సోదరి పేర 2 ఎకరాలు ఎక్కడ ఉందో చూయించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. తనతోనే జడ్చర్ల బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని చెప్పుకొంటున్న ఎమ్మెల్యేతో ముందు ఆయన తీరుతో నియోజకవర్గ ప్రజలందరూ నవ్వుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఆం ధ్రా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపాలని చెబుతున్నావ్ మొ దట నియోజకవర్గంలో చేస్తున్న ఆంధ్రా కాంట్రాక్టర్ల బిల్లు లు నిలుపుదల చేయి అని డిమాండ్ చేశారు.