జడ్చర్లటౌన్, ఫిబ్రవరి19 : ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్ల పట్టణంలోని పాతబజార్‌లో శివాజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు యాదయ్య, పట్టణ అధ్యక్షుడు మురళి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఐతోలులో శివాజీ విగ్రహావిష్కరణ
తాడూరు, ఫిబ్రవరి 19 : నాటి సమాజంలో జరుగుతున్న ఆరాచకాలను అంతమొందించాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలతో ఎదురొడ్డి పోరాడిన యోధుడు అని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. మండలంలోని ఐతోల్లో గ్రామస్తుల సహకారంతో బుధవారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బావిభారత పౌరులని కొనియాడారు.
ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకుగానూ గ్రామస్తులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్య, సింగిల్ విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తుడు నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, మాజీ ఉప సర్పంచ్ హుస్సేన్ జీ, వెంకట్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, భీంరెడ్డి, చిన్నారెడ్డి, రమేశ్‌గౌడ్, హరికృష్ణశర్మ, అఖిల్‌రెడ్డి, రాంకిషన్జీ, మల్లేశ్‌తోపాటు విద్యార్థులు, యువకులు, వివిధ గ్రామాలకు చెం దిన నాగ్ అశ్విన్ అభిమానులు పాల్గొన్నారు.