అచ్చంపేట, జూలై 17 : నల్లమలలోని లొద్దిమల్లయ్య క్షేత్రాన్ని బుధవారం భక్తులు ద ర్శించుకొని పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని అటవీశాఖ విధించిన ఆంక్షల మధ్య స్థానిక భక్తులు కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. బా ణాల, చౌటపల్లి మీదుగా కాలినడకతో వెళ్లి భక్తులు లొద్దిమల్లయ్యను చేరుకొని పూజలు చేశారు. మన్ననూర్ మీదుగా వెళ్లిన భక్తులను అటవీశాఖ అధికారులు మార్గమధ్యంలో నిలిపివేయడంతో శ్రీశైలం-హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేయగా చివరికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఏడాదికి ఒక్కసారి తొలి ఏకాదశి రోజు దర్శనమిచ్చే లొద్దిమల్లయ్యను పూజించాలని భక్తులు ఎంతో ఎదురుచూడగా అటవీ శాఖ అధికారులు నిబంధనల పేరుతో స్వామి వా రిని దర్శించుకొనే వెసులుబాటును ఇవ్వకపోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఒక రోజు మాత్రమే అనుమతి ఇవ్వగా భక్తులు గుండంలో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు నిషేధించడంతో భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు.