కల్వకుర్తి, జూలై 14 : కల్వకుర్తి పట్టణంలోని మినీ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 10వ రాష్ట్ర స్థాయి బాలికల సబ్ జూనియర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్లో మహబూబ్‌నగర్-నిజామాబాద్ జట్లు పాల్గొనగా, 1-0 గోల్ తేడాతో నిజామాబాద్ జట్టుపై మహబూబ్‌నగర్ విజయం సాధించింది. తృతీయ స్థానంలో ఖమ్మం, నల్లగొండ జట్లు నిలిచాయి. విజేత, రన్నర్ జట్లకు ట్రోఫీలను ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గుణ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో క్రీడాకారులకు కొదవ లేదన్నారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లే సత్తా ఉం దని ఆయన పేర్కొన్నారు. అమ్మాయిలకు ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడలతోపాటు చదువు కూడా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి పాండు, యాదయ్యగౌడ్, వెంకటేశ్, గజానంద్, రాజేందర్, విజయభాస్కర్‌తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తకోట, జూలై 14 : జాతీయ స్థాయి తైక్వాండో పోటీలను ఈనెల 12 నుంచి 14వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓపెన్ చాంపియన్‌షిప్ ఇం డియా స్పోర్ట్స్, తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలకు మహారా్రష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. అండర్-13, అండర్-26 కేజీల విభాగంలో సయ్యద్ అహ్మద్, జాఫర్ బంగారు పతకాలు సాధించినట్లు గాడ్స్ ఆన్ వారియర్స్ కరాటే క్లబ్ మాస్టర్ ఎస్కే నబీ ఆదివారం ప్రకటనలో తెలిపారు.