గద్వాల, డిసెంబర్ 2 : జిల్లా కేంద్రంలోని భీంనగర్లో ఉన్న ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ అభ్యసన ఉన్నతపాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గరయ్యారు. పాఠశాలలో ఉదయం ప్రార్థన చేస్తున్న సమయంలో మొదట ఇద్ద రు ఆ తర్వాత 12మంది విద్యార్థులు అస్వస్థతకు గు రయ్యారు. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. సంఘటన వివరాలోకి వెళితే జిల్లా కేంద్రంలోని భీంనగర్లో ఉన్న ఎస్టీ బాలుర వసతిగృహంలో 120మంది విద్యార్థులు ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు.
ఉదయం విద్యార్థులకు ఉప్మాతోపాటు అరటి పండ్లు, బిస్కెట్లు ఇచ్చారు. అయితే ఉప్మా తినే సమయంలో పురుగులు రావడంతో విద్యార్థులు వసతి గృహ నిర్వాహకుడికి తెలుపడంతో వెంటనే ఆ ఉప్మా ను పారబోయించాడు. అనంతరం విద్యార్థులకు అరటి పండు, బిస్కెట్లు ఇచ్చారు. వాటిని తిని విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో ప్రార్థన చేస్తు న్న సమయంలో మొదట ఇద్దరు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఒక్కసారి మరో 12మంది విద్యార్థులు అ స్వస్థకు గురి కావడంతో వెంటనే వారిని జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అక్కడ డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉప్మా ఉండలు కట్టి ఉండడంతో దాంట్లో పురుగులు వచ్చాయని తెలిపారు. దాన్ని తిన్న కొంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వసతిగృహాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ నాసిరకం సరుకులు సరఫరా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు వాపోయారు.
ఉప్మా, అరటిపండ్లు, బిస్కెట్లు తినడం వల్ల ఫుడ్ పా యిజన్ అయినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థు లు అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్నా ఇక్కడి పాలకులు, ఉన్నతాధికారులు కనీసం దవాఖానకు వెళ్లి పరామర్శించక పోవడం చూస్తే వా రికి వసతి గృహా విద్యార్థులపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అనంతరం వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు వైద్యులు ముందస్తుగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
అస్వస్థతకు గురైన 14మంది విద్యార్థులు
వసతి గృహంలో 120 మంది విద్యార్థులు ఉండ గా అందులో 14మంది వి ద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. అస్వస్థకు గురై నా వారిలో విష్ణునాయక్, వినోద్నాయక్, మునెప్ప, రామ్చరణ్, రాహుల్నాయక్, సేవాలాల్, గుణనాయక్, శివనాయక్, రాకేశ్నాయక్, చరణ్, వెంకటేశ్నాయక్, శ్రీకాంత్నాయక్, టీ రాహుల్, సందీప్ ఉన్నారు.
అవసరమైన చికిత్సలు అందించాం : కలెక్టర్
జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహ విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురికాగా వారికి అవసరమైన చికిత్సలు అందించినట్లు కలెక్టర్ సంతో ష్ తెలిపారు. విద్యార్థులు ఉదయం వసతిగృహం నుంచి టిఫిన్ చేసి ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలకు వెళ్లాక ఎండకు ఇద్దరు విద్యార్థులు ప్రా ర్థన సమయంలో అస్వస్థతకు గురి కాగా వారికి ఉపాధ్యాయులు విశాంత్రి కల్పించారన్నారు. కొద్ది సేపటకి మరో 12మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు చెప్పారు.
వారికి దవాఖానలో ప్రాథమిక చికిత్స నిర్వహించారని, ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వెంట నే విద్యార్థులను డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నా రు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయించి బా ధ్యులైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.అధికారులు నెలలో మూడు సార్లు వారి పరిధిలోని వసతి గృహాలతోపాటు, కస్తూర్బా విద్యాలయాలను సందర్శించాలని ఆదేశించినట్లు చెప్పారు.
వసతి గృహాలపై కాంగ్రెస్ చిన్నచూపు
బీఆర్ఎస్వీ నాయకుడు కుర్వ పల్లయ్య
బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే వసతి గృహాలపై రేవంత్రెడ్డి సర్కారు చిన్నచూపు చూస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య ఆరోపించారు. ఆయన మంగళవారం ఫుడ్పాయిజన్ అయి అస్వస్థకు గురైనా ఎస్టీ వసతి గృహా న్ని సందర్శించి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే వసతి గృహాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమై న భోజనం అందించడంలో రేవంత్రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ వసతిగృహాలపై అధికారులు నిర్లక్ష్యం వీడి విద్యార్థులకు నాణ్యమైనా భోజనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.