అచ్చంపేటటౌన్/అమ్రాబాద్, జూలై 9 : అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పీటీజీ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అ ల్పాహారం తీసుకున్న కొద్ది సేపటికే 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, సిబ్బంది వెంటనే స్పందించి ప్రథ మ చికిత్స అనంతరం హుటాహుటినా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. అయితే దవాఖాన లో బెడ్ల కొరత ఉండడంతో కొంత మం ది విద్యార్థులను బెడ్షీట్ వేసి పడుకోబెట్టి వైద్య సేవలు అందించారు.
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్డీవో యాదగిరి, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానకు చే రుకొని విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, మెరుగైన చికిత్స అం దించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఘటనపై పూర్తి విచారణ అనంత రం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మ న్ననూర్ పీటీజీ పాఠశాలను తనిఖీ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులను పిలిపించి నీటి, ఆహార నమూనాలను సేకరించారు. అస్వస్థతకు గల కారణాలను త్వరలో నిగ్గు తేల్చి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్య లు తీసుకుంటామని వారు తెలిపారు.
మన్ననూర్ ప్రభుత్వ గిరిజన పీటీజీ బా లుర గురుకుల పాఠశాలలో అల్పాహా రం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్ట ర్ మహేశ్ తెలిపారు. 26 మంది విద్యార్థులు దవాఖాన రాగా అందులో చరణ్, గణేశ్, రామాంజనేయులు ముగ్గురికి వాంతు లు కాగా మిగతా వారు కడుపునొప్పితో చేరారని వారంతా కోలుకుంటున్నారని గంటల్లో దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులను స్థానిక బీఆర్ఎస్ నేతలు అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యాబోధన, వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభు త్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లో పలుమార్లు ఎన్నో ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా విద్యాశాఖను తనవద్దే ఉంచుకొని విద్యార్థులపై సవతితల్లి ప్రేమ చూపుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ భీమా, నర్సింహాగౌడ్, అమీనొద్దీన్, రవీందర్రెడ్డి, చెన్నకేశవులు, మాజీ కౌన్సిలర్లు కుతుబుద్దీన్, రమేశ్రావుతోపాటు వివిధ మండలాల నాయకులు ఉన్నారు.