IND vs ZIM : టీ20ల్లో వరసగా ఆరు ఓటములతో అవమానపడ్డ భారత జట్టు గెలుపు బాట పట్టింది. అనుకున్నట్టే జింబాబ్వే పర్యటనను భారీ విజయంతో ఆరంభించి సిరీస్‌లో ముందంజ వేసింది. 126 పరుగుల స్వల్ప ఛేదనలో వైభవ్ సూర్యవంశీ(50) మెరుపు ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయంగా మొదటి అర్ధ శతకం నమోదు చేయగా.. ఇషాన్ కిషన్(35) దంచేశాడు. 11 ఓవర్లకే స్కోర్ వంద దాటేయగా.. తిలక్ వర్మతో కలిసి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్(28 నాటౌట్) లాంఛనం ముగించాడు. ఏడు వికెట్లతో గెలుపొందిన భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. కెప్టెన్‌గా అయ్యర్ తొలి విజయాన్ని రుచి చూశాడు.
స్వదేశంలో ఇటీవలే బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ విజయం, టీ20లో గెలుపుతో జోరు మీదున్ను జింబాబ్వేకు గట్టి షాకిచ్చింది భారత్. తొలుత బౌలర్ల ప్రదర్శనతో 125కే కట్టడి చేసిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఉఫ్‌మనిపించింది. ఇంగ్లండ్ గడ్డపై విఫలమైన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(50) పిడుగల్లే రెచ్చిపోగా చూస్తుండగానే చిన్నపాటి లక్ష్యం మంచుముక్క కంటే వేగంగా కరిగిపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన సూర్యవంశీ ఐపీఎల్ తరహా విధ్వంసాన్ని కళ్లకు కట్టాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(1) త్వరగా ఔటయ్యాక.. సూర్యవంశీ మరింత రెచ్చిపోయాడు.
Maiden international fifty 👏
Vaibhav Sooryavanshi becomes the youngest batter ever to score a T20I half-century 🫡
Follow the match ▶️ https://t.co/NKa0znQQ3H#TeamIndia | #ZIMvIND pic.twitter.com/aUWiBE9FLz
— BCCI (@BCCI) July 23, 2026
ముజరబనిని బాదేస్తూ.. 5వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టి అర్ధ శతకానికి చేరువయ్యాడు. ఇషాన్ కిషన్(35) సైతం మూడు ఫోర్లు సంధించగా 6 ఓవర్లకే స్కోర్ 68కి చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే డబుల్స్‌తో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న వైభవ్.. వెంటనే ఔటయ్యాడు. అనంతరం.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(28 నాటౌట్) జతగా కిషన్ చెలరేగాడు. వీరిద్దరు ధనాధన్ ఆడి 11 ఓవర్లకే స్కోర్ వంద దాటించారు. ఇషాన్ ఔటైనా.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(6 నాటౌట్) సాయంతో అయ్యర్ లాంఛనం ముగించాడు. 7 వికెట్లతో గెలుపొందిన భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.
At last, a win for Shreyas Iyer as T20I captain. India cruise through the chase to register their first men’s T20I victory in eight matches 💪 pic.twitter.com/LpqxLrar9y
— Cricinfo (@cricinfo) July 23, 2026
టాస్ ఓడిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడు మయాంక్ యాదవ్(2-18). దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసిన మయాంక్ మొదటి ఓవర్లోనే డేంజర్ బ్రియాన్ బెన్నెట్(0)ను సున్నాకే ఔట్ చేశాడు.. అదే ఊపులో మోర్స్‌ను డగౌట్ చేర్చాడు. మరో ఎండ్‌లో ప్రిన్స్ యాదవ్(2-19), సికిందర్ రజా(4)ను శివం దూబే ఔట్ చేయగా 32కే నాలుగు వికెట్లు కోల్పోయింది జింబాబ్వే.
వెస్లీ మధీవెరె(39)

వంద లోపే చాపచుట్టేసిలా కనిపించిన రజా బృందాన్ని వెస్లీ మధీవెరె(39), రియాన్ బురి(26)లు ఆదుకున్నారు. దూబేను టార్గెట్ చేసి వీరు బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు. ఆఖర్లో మరుమణి(27 నాటౌట్) ధాటిగా ఆడడంతో ఆతిత్య జట్టు స్కోర్ వంద దాటింది. ఈ ముగ్గురు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 125 రన్స్ కొట్టింది.