మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి (Floodwaters ) ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ( Sikta Patnayak,) అధికారులను ఆదేశించారు ( Collector orders ) . సోమవారం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టుపై పారుతున్న వరద నీటి ప్రవాహాన్ని ఆమె పరిశీలించారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో కర్నీ గ్రామానికి ఎగువ ప్రాంతంలో ఉన్న టేకుల పల్లి, రుద్ర సముద్రం, గొల్ల పల్లి గ్రామాల చెరువులు నిండి అలుగు పారుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆయా చెరువుల అలుగు నీరు కర్నీ గ్రామ కల్వర్టుపై కి చేరి మోకాళ్ల లోతు వరకు ఉదృతంగా పారుతోందని, ఇలాంటి సమయంలో ప్రజలు ప్రమాదకరంగా పయనించడం క్షేమం కాదని తెలిపారు.
కల్వర్టుకు రెండు వైపుల సిబ్బందిని ఉంచి ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని ఎంపీడీవో రమేష్ ను ఆదేశించారు. విద్యార్థులు, వృద్ధులు వాగు దాటే ప్రయత్నం చేస్తుంటారని ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అవసరమైన ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని మక్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రమేష్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ఉన్నారు.