ధరూరు/అయిజ, జూలై 16 : వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్ట్‌కు 1,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,401 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 3.975 టీఎంసీల నిల్వ ఉన్నది. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీ మా లిఫ్ట్-1కు 1151, భీమా లిఫ్ట్ -2కు 847, ఎడమ కాల్వ కు 390 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 36,170, అవుట్‌ఫ్లో 211 క్యూసెక్కులు గా నమోదైంది. డ్యాం గరిష్ఠనీటి నిల్వ 105.855 టీఎంసీల సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 35.473 టీఎంసీల నిల్వ ఉన్నది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1,608.91 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. బుధవా రం తుంగ జలాశయం నుంచి వరద మరిం త పెరిగే అవకా శం ఉంద న్నారు.