అయిజ, జూన్ 6 : కర్ణాటకలోని ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్వల్పంగా వచ్చి చేరుతోంది. శుక్రవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 7,700 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 255 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠనీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1600.16 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తు తం 21.731 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 213 క్యూ సెక్కులు ఉండగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, దిగువన ఉన్న సుంకేసుల బారాజ్‌కు 300 క్యూసెక్కులు వరద చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
అమరచింత, జూన్ 6 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఎస్ఈ పవన్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సా యంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్న జల విద్యుత్ ఉత్ప త్తి కేంద్రంలో గురువారం 1. 155 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకు 13,160 యూనిట్ల విద్యు త్ ఉత్పత్తి జరిగిందని, ఆత్మకూర్ మండలంలోని దిగువ జల విద్యుత్ కేంద్రంలో 1.513 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 14,242 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు చెప్పారు. శుక్రవారం కూడా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.