మహ్మదాబాద్, మార్చి 8: మహ్మదాబాద్ ఫారెస్టు రేంజ్ అటవీప్రాంతంలో దాదాపు అర కిలో మీటరు మేర మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.
స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ధర్మాపూర్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు అడవికి నిప్పంటుకుని చుట్టుపక్కల అర కిలో మీటరు వరుకు మంటలు వ్యాపించాయి. ఎండల తీవ్రత వల్ల చెట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.