జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల ( Gadwal ) జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో ఇటీవల చేపలు పట్టడానికి వెళ్లి రిజర్వాయర్‌లో మునిగి చనిపోయిన దుబ్బంబాయి రాముడు, సంధ్య పిల్లలకు బుధవారం స్థానికులు ఆర్థిక సహాయం ( Financial assistance ) అందజేశారు. జర్నలిస్టు రామాంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారులకు దాతల ద్వారా సేకరించిన 28,000 నగదు, నిత్యావసర సామాగ్రి బియ్యం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా రామాంజనేయులు అనేకమంది అభాగ్యులకు అండగా నిలుస్తూ వారిని ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. డీలర్ పద్మా రెడ్డి, రైస్ మిల్ శ్రీనివాసులు , ఫోటోగ్రాఫర్ శేఖర్ ఒక్కో బియ్యం ప్యాకెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, పద్మా రెడ్డి, సీనియర్ జర్నలిస్టు ముకుందరావు, దామ లక్ష్మీనారాయణ, శేఖర్, మీనిగ ఆంజనేయులు, పాముల నాగరాజు, గోపాల్ , గ్రామస్థులు పాల్గొన్నారు.