మహమ్మాదాబాద్ : మండల పరిధిలో వెంకట్రెడ్డి పల్లి అనుబంధ గ్రామం కొలిమిపల్లి గ్రామంలో సోమవారం ఎరుకలి అడివయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి అంత్యక్రియల ( Funerals ) నిమిత్తం గ్రామానికి చెందిన కుమ్మరి రామకృష్ణ అనే దాత మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 10 వేలను ఆర్థిక సహాయం (Financial assistance) అందించారు.
గ్రామంలో ఎవరు మృతి చెందిన గత రెండు సంవత్సరాలుగా తన సొంత నిధులను ఆర్థిక సహాయం కింద అందజేస్తున్నారు. సోమవారం రామకృష్ణ అందుబాటులో లేకపోవడంతో తన సోదరుడు మాజీ సర్పంచ్ కుమ్మరి రాములు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేయించారు.