భూత్పూర్ : పండుగలు సంస్కృతి ,సంప్రదాయాలను, ఐక్యతను పెంచుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ( MLA Madhusudhan Reddy ) అన్నారు. శనివారం మండలంలోని కప్పెట గ్రామంలో బొడ్రాయి ( Bodrai ) ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పూర్వకాలం నుంచి గ్రామాల్లో బొడ్రాయికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు
. ఈ వేడుకలను గ్రామస్తులు అంతా కలిస్తేనే జరుగుతుందని తెలిపారు. పండుగలతో గ్రామస్తుల మధ్య అన్ని కులాలు, మతాల మధ్య ఐక్యమత్యం ఏర్పడుతుందని తెలిపారు. పండుగలు మన ఆచార వ్యవహారాలను గుర్తు చేసేందుకే జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, విజయ్ గౌడ్, టీవీ రెడ్డి, మాస గౌడ్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.