అలంపూర్ చౌరస్తా, మార్చి 15: నడిరోడ్డుపై మహిళా అఘోరీ నాగసాధు హల్ చల్ చేసిన సంఘటన శనివారం ఉండవెల్లి మండలం బైరాపురం రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. జోగులాంబ ఆలయ సమీపంలో ఉన్న దర్గాను తొలగిస్తానని అఘోరి నాగసాధు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వీడియోలో వైరల్ అయ్యింది. శనివారం అలంపూర్ ఆలయ సమీపాన ఉన్న దర్గాను కూల్చివేస్తానంటూ కారులో బయలుదేరిన నాగసాధు అఘోరీని జోగులాంబ-గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం స్టేజీ సమీపాన పోలీసులు అడ్డుకున్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయాని వెళ్లి పూజలు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ఇతర ఇతర మతాలకు చెందిన దర్గాలను కూల్చివేస్తానని చెప్పడం సమంజసం కాదని అఘోరీకి నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను కూడా లెక్కచేయకుండా వెళ్తానని మొండికేసి వారితో నాగసాధు వాగ్వాదానికి దిగారు. ‘నా సత్తా ఏమిటో
మీ అందరికీ చూపుతా’ అని పోలీసులను హెచ్చరించారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఆమెను ఉండవెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.