మక్తల్ : వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ( Power Supply) అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారి 167 పై రాస్తారోకో ( Farmers Protest ) ను చేపట్టారు. మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు చెందిన రైతులు గుడిగండ్ల సబ్ స్టేషన్ ముట్టడించారు. జక్లేర్ గ్రామంలో జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.

గుడిగండ్ల గ్రామంలో బీఆర్ఎస్ ( BRS ) నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి, వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సగం ముగుస్తున్న సమయంలో, వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి, కరెంటు కోతలతో పాటు, అరా కోరా కరెంటు సరఫరా వల్ల కొద్దిపాటి సాగు చేసుకున్న పంటలు సైతం కాపాడుకోలేక పోతున్నామని వాపోయారు.
వచ్చే ఐదు గంటలలో సైతం కరెంటు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుందో తెలియక, రైతుల సతమతమవుతుంటే, నాణ్యతలేని కరెంటు విడుదల చేస్తున్నాడంవల్ల మోటర్లు,మొరాయించడంతోపాటు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఈ నవీన్ కుమార్ జాతీయ రహదారిపై రైతులు చేపడుతున్న ధర్నా వద్దకు చేరుకొని రైతులకు వ్యవసాయానికి 12 గంటల పాటు నిరంతరపాయంగా విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.