Medicover | సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి ముందు భారీగా బ్యానర్లు వెలిశాయి. ‘కంగ్రాచ్యులేషన్స్.. రేవంత్ గారు.. రూ.13,200 కోట్లు’ అంటూ రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లను ఏర్పాటు చేశారు.
మెడికవర్ హాస్పిటల్‌ను రూ.13,200 కోట్లకు విక్రయించి బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నరు’ అంటూ శనివారం నాడు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన విషయాలు బయటపెట్టారు. కేసీఆర్ పాలనలో 80 నుంచి 90 శాతం పూర్తయిన టిమ్స్ హాస్పిటళ్లను ప్రారంభించని సీఎం రేవంత్‌రెడ్డి..తన అల్లుడు వాటాదారుగా ఉన్న మెడికవర్ దవాఖానలను మాత్రం దర్జాగా ప్రారంభించారని చురకలంటించారు. మెడికవర్ ఆస్పత్రిని రూ.13,200 కోట్లకు విక్రయించి బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి ముందు ‘రూ.13,200 కోట్లు’ అంటూ బ్యానర్లు ఏర్పాటయ్యాయి.
సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి ముందు భారీగా వెలసిన బ్యానర్లు
కంగ్రాజులేషన్ రేవంత్ రెడ్డి గారు రూ.13,200 కోట్లు అంటూ రోడ్డుకు ఇరువైపులా వెలిసిన బ్యానర్లు https://t.co/k4JIiQgISK
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026