వనపర్తి టౌన్, అక్టోబర్ 26 : వనపర్తిలో ఈనెల 29న నిర్వహించనున్న రైతు నిరసన సదస్సు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం వద్ద ఖాళీ స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమానికి అన్ని అనుమతులు తీసుకోవాలని, రైతులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలన్నారు.
సదస్సుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు హాజరవుతున్నారన్నారు. రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు రమేశ్‌గౌడ్, అశోక్, రవిప్రకాశ్‌రెడ్డి, తిరుమల్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, పరంజ్యోతి, ధర్మానాయక్, మహేశ్వర్‌రెడ్డి, నర్సింహ, శ్రీను, శాంతన్న, గిరి, జోహెబ్ హుస్సేన్, రాముగౌ డ్, నాయక్, క్రాంతి, హన్మంతు, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.