పాలమూరు, ఏప్రిల్ 25: అరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం( Paddy Purchase Centers ) వద్ద గన్ని బ్యాగుల కొరత(Gunny bags) ఏర్పడింది.
అధికారులకు రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో రైతులు శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వా తీరును నిరసిస్తూ రాయచూర్ జాతీయ రహదారి అప్పయ్యపల్లి గేటు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి మారాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.