అయిజ, మార్చి 29 : అధికారంలోకి రాకముందు ఉరుకుండ్రి రూ.2లక్షల రుణం తెచ్చుకోండ్రి.. నేను అధికారంలోకి వచ్చినెంటనే మాఫీ చేస్తానంటూ గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా.. కొంతమందికే రుణమాఫీ చేసి చాలా మందికి పంగనామాలు పెట్టాడని రైతులు మండిపడుతున్నారు. శనివారం మండలంలోని సిం ధనూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట రూ.2లక్షల రుణమాఫీ బే షరతుగా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ డిక్లరేషన్ పత్రాలను ప్ర దర్శిస్తూ రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు దేవేందర్ రెడ్డి, కుర్వ తిమ్మప్ప, తెలుగు దేవేందర్, ఉరుకుందమ్మ తదితరులు మా ట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రు ణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక కొర్రీలు పట్టి అర్హులైన రైతులకు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు.
ఏడాది నుంచి రుణమాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో పెట్టడం లేదని మండిడ్డారు. ప్రతి రోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఎంతకాలం రైతులను మోసం చే స్తారని మండిపడ్డారు. రైతులను మోసం చేసినోళ్లు బాగుపడరని శ పించారు. సింధనూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో అయిజ మండ లంలోని సింధనూర్, కుటుకనూర్, టీటీదొడ్డి, కొత్తపల్లి, బైనపల్లి, మూ గోనిపల్లి, గట్టు మండలంలోని హిందువాసి, బోయిలగూడెం, లింగాపు రం, చమన్కాన్దొడ్డి, రాయచూర్ జిల్లాలోని తల్మారీ గ్రామాల్లోని దాదా పు 2,800 మంది రైతులు రుణాలు పొందగా, కేవలం 2,100 మంది రై తులకు రూ.15.50కోట్ల రుణమాఫీ జరిగిందని, మరో 700మంది రైతుల కు రూ.2లక్షల వరకు రుణమాఫీ కావాల్సి ఉందని తెలిపారు.
ఆరుగాలం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు రైతు భరోసా అంతంత మాత్రం విడుదల చేసిందన్నారు. సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కా క, రైతు భరోసా రాక అష్టకష్టాలు పడుతున్నామని, ఇప్పటికైనా నిబంధన లు తొలగించి ప్రతి రైతుకు రూ.2లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రు ణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను నిండా ముంచిందన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువని, 65ఏండ్లలో కాంగ్రెస్ స ర్కారు అలసత్వంతో ఎంతో మంది రైతులు కరవుతో అల్లాడిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కుట్ర, నయవంచన, మోసం, దగా అని తెలిపారు. ఎన్నికల మెనిఫెస్టోలో రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి రూ.12వేలకు తెచ్చి అవి కూడా ఇవ్వ డం చేతగావడం లేదన్నారు. నెలాఖరు వరకు ఐదెకరాల వరకు వేస్తామని హామీ ఇచ్చినా నేటి వరకు రైతుల ఖాతాలో జమ చేయకుండ కాలయాపన చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో రైతులు దేవేందర్‌రెడ్డి, తిమ్మప్ప, దే వేంద్ర, తులసిగౌడ్, జమ్మన్న, రామన్న, రంగన్న, రాజు, నడిపెన్న, ఉరు కుందమ్మ, పార్వతమ్మ, కోటి, వీరేశ్, నరసింహులు, మాధవ్ ఉన్నారు.