కల్వకుర్తి, ఆగస్టు 20 : కల్వకుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు కార్యాలయం ఎదుట మంగళవారం రైతు జే ఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మూడు విడుతల పేరుతో కొ ర్రీలుపెడుతూ కేవలం 40 శాతం మంది రైతులకు మా త్రమే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు.
రేషన్ కార్డు ప్రాతిపదికన రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినా నేడు ఎం దుకు చేయడం లేదని ప్రశ్నించారు. మాఫీని పరిశీలిస్తే ప్రభుత్వం జీవో ఇచ్చిన విధంగానే జరిగిందని, సీఎం, మం త్రులు మాత్రం సాంకేతిక కారణాలంటూ మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వకుండా, మాఫీ ముందేసుకుని, అది కూడా సంపూర్ణంగా అందించకుండా కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నెర్ర చేశారు.
రైతుబంధుకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్‌కు నూకలు చెల్లే రోజుల దగ్గర పడ్డామని హెచ్చరించారు. రైతుల ఉసురు పోసుకోవద్దని, వారు బాధపెడితే మట్టికొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అనంతరం ఏడీఏ కార్యాలయంలో వినతిప్రతం అందజేశారు. కార్యక్రమం లో రైతు జేఏసీ నాయకులు బండెల రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకృష్ణ, శేఖర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, నర్సింహారెడ్డి, రాంరెడ్డితోపాటు రైతులు పాల్గొన్నారు.