వనపర్తి టౌన్, మే 6 : మండలంలోని సల్కలాపూర్కు చెందిన ఊషన్న ధాన్యాన్ని బియ్యం పట్టించేందుకు మిల్లుకు తరలించే ముందు మండలంలోని మూడు వే బ్రిడ్జీల్లో తూకం వేయించాడు. మూడింట్లో వేర్వేరుగా తూకం రా వడంతో అవాక్కయ్యాడు. ఒక దాంట్లో 9,910 కేజీలు, మరో వే బ్రిడ్జిలో 9,640 కేజీలు, ఇంకో వే బ్రిడ్జిలో 9,730 కేజీల తూకం వచ్చింది.
దీంతో ఊషన్న ఒక్కో వే బ్రిడ్జిలో ఒక్కో తూకం రావడం ఏమిటని వే బ్రిడ్జి యజమానులను నిలదీశారు. విషయం తెలుసుకున్న ఇంకొంత మంది రైతులు వే బ్రిడ్జి యజమానులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.