నాగర్‌కర్నూల్, మే 23 : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొ నుగోలు ప్రక్రియను పర్యవేక్షణ చేసి తేమ శా తం, వచ్చిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు జరపడం ట్యాగ్ చేసిన మిల్లులకు తరలిస్తున్న తీరును నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వ సతులను, ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్, రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటు న్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలులో గణనీయమైన వృద్ధి దిశగా ముందుకు పోతున్నట్లు చెప్పారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాతావరణ పరిస్థితుల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు ప్రతి కొనుగోలు కేం ద్రంలో సరిపడే టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాన్ని శుక్రవా రం కలెక్టర్ సంతోష్ పరిశీలించారు.
మండల కేంద్రంలో నిర్మితమవుతున్న మోడల్ హౌస్‌ను సందర్శించి, నిర్మాణ నాణ్యతను పరిశీలించి అందుబాటులో ఉన్న వసతులను మెరుగుపరచాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. గదులను పరిశీలించి, డిజిటల్ గ్రంథాలయ ఏర్పాటు గు రించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పలు రికార్డులను పరిశీలించారు. అలాగే తూడుకుర్తి గ్రామంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సర్వే నెంబర్ 816లోని ప్రభుత్వ భూములకు సంబంధించిన స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. వి ద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు అత్యున్న త ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టి లో పెట్టుకొని మెరుగైన వసతుల కల్పనకు అవసరమైన అదనపు భూములను కూడా గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. అలాగే యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రయోజనాలు అందించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, బీ సీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్ అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉ పాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తాసీల్దార్ జకీర్అలీ, ఎంపీడీవో కోటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ నరేశ్, లైబ్రేరియన్ పరమేశ్వరి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.