వెల్దండ, జనవరి 6 : ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ మండలంలోని బండోనిపల్లికి చెందిన రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. వారి వివరాల ప్రకారం బండోనిపల్లి గ్రామానికి చెందిన 16మంది రైతులు తాము ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షలలోపు రుణమాఫీకి అర్హులం అన్నారు.
అయి తే తాము అన్ని విధాలా అర్హులైనప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడుతల్లో కూడా మాకు మాఫీ మంజూరు చేయలేదని గ్రామానికి చెందిన వావిళ్ల అల్వాల్యాదవ్తోపాటు 15 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తా ము వెల్దండ ఎస్బీఐ రుణాలు తీసుకున్నామని, రుణమాఫీ కాకపోవడంతో అధికారులను అడిగితే మేమేం చేయాలి..? ప్రభుత్వం ఇస్తే వద్దంటామా ఒక్క వెల్దండ బ్రాంచ్ పరిధిలోనే 1671 మంది రుణమాఫీ వర్తించలేదని వారు చెప్పినట్లు వాపోయారు. అందుకే తమకు ప్రభు త్వం ఎందుకు రుణమాఫీ చేయలేదో చెప్పాలని కోరు తూ కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇస్తే మేము వద్దంటమా..? మాది ఏమి పోతుంది.. మా చేతిలో ఏమి లేదని బ్యాంక్ అధికారులు అంటున్నారు. నాకు గుం డాల గ్రామ రెవె న్యూ శివారులో 4.20 ఎకరాల భూమి ఉంది. వెల్దండ ఎస్బీఐలో పంటరుణం తీసుకున్నా నాలుగు విడుత ల్లోనూ నాకు రుణమాఫీ కాలేదు.. ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేకపోవడం తో కోర్టును ఆశ్రయించాం.
– అల్వాల్యాదవ్, రైతు బండోన్పల్లి, వెల్దండ మండలం