మాగనూరు, జూలై 10 : వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా, డీఏపీల కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారక ముందే పీఏసీసీఎస్ గోదాముల వద్ద బారులు దీ రుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. గత పదేండ్లలో ఏనాడూ ఎరువుల కోసం ఇంతటి ఇబ్బందులు ప డలేదని, మున్ముందు ఎరువులు అవసరమైతే పరిస్థి తి ఏమిటని రైతులు ఇప్పటి నుంచే ఆందోళన చెం దుతున్నారు.
గోదాముల వద్ద ఒకరికి 5 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని సమాచారంతో మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలంలోని గ్రామస్తులు కుటుంబ సభ్యులతో సహా మాగనూర్ పీ ఏసీసీఎస్కు గురువారం భా రీగా యూరియా కోసం పడి గాపులు కాశారు. ప్ర స్తుతం పత్తి, మొకజొన్న పంటలు సాగు చేసే రైతులకు యూరి యా అవసరం ఉన్నది.
అరకొర బస్తా లు రావడంతో ఉమ్మడి మండలంలోని ప్రైవేట్ ఫర్టిలైజర్లలో డీఏపీ రూ.1350 నుంచి రూ.1600 వరకు యూరియా రూ.270 నుం చి రూ.400 వరకు విక్రయి స్తున్నట్లు రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధా ర్ కార్డులతో పీఏసీసీఎస్కు చేరుకు న్న రైతులు క్యూలో నిల్చునే ఓపిక లేక పోవడంతో జిరాక్స్ ప్ర తులను అధికారుల ముందు వరుసగా పెట్టి యార్డు షెడ్ల కింద, చెట్ల కింద, రోడ్ల వెంట రో జంతా కూర్చు న్నారు. అయితే మాగనూరు, కృష్ణ మండలానికి కేవలం రెండు లోడ్ల యూరియా రావడంతో అం దుతాయో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు.