మక్తల్ టౌన్, ఏప్రిల్ 6 : సాగునీటిపై ఎమ్మెల్యేకు అవగాహన లేకనే యాసంగిలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో మక్తల్ తాసీల్దార్ సువర్ణరాజుకు చిట్టెం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన స్వగృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేకు సాగునీటిపై అవగాహన లేకనే నియోజకవర్గంలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే వాహనానికిచ్చే స్టికర్లను ఇతర వ్యక్తులకు ఇవ్వడమేంటని, ఈ విషయమై శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలుచేసిన కాంగ్రెస్.. మిగతా హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. ఎండిపోయిన పంటలను గుర్తిం చి ప్రతి రైతుకూ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను కష్టపెడితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేరొన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వా రా నారాయణపేట జయమ్మచెరువును నింపడానికి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ రైతులకు నష్టం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, నాయకులు తదితరులు పాల్గొన్నారు.