గద్వాల, జూలై 21 : ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ వానకాలం సకాలంలో కురువని రైతులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్న తరుణంలో గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు మురిసి పోతున్నారు. అదే సమయంలో రైతన్నలు ఆశల సాగుకు సిద్ధమవుతున్నారు. రైతుకు కాలం కలిసి వచ్చినా రాకున్నా వ్యవసాయంపై ఆశ వదులుకోక ఏడాదికేడాది నష్టం వాటిళ్లినా వచ్చే ఏడాదైనా కాలం కలిసి రాదా అనే ధైర్యంతో రైతన్న ముందుకు సాగుతున్నాడు. గత వానకాలంలో సరైనా వర్షాలు కురువడంతో రైతులు సాగు చేసిన పంట పొలాలు పంటలు బాగా పండిన ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించక, రైతులకు సకాలంలో అమ్మిన పంటలకు నగదు చెల్లించక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానకాలంలో వర్షాలు ఆలస్యమైనా ప్రస్తుతం మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో కాలం కలిసి వస్తే అప్పులు పోనూ కడుపు నిండ అన్నం దొరుకుతుందనే ఆశతో రైతులు పంటల సాగు చేస్తున్నాడు.
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో వరి పంటను 1,16,532 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. నాట్ల కోసం 965 ఎకరాల్లో రైతులు నారు మడులు పోసుకున్నారు. అయితే నీటి లభ్యత లేని కారణంగా నారు మడులు పెరిగిన నాట్లు వేసే పరిస్థితి లేదు. దీంతో నారు మడులు ఎండిపోతున్న తరుణంలో వర్షాలు నారు మడులు ఎండిపోకుండా కొంత ఊరట నిచ్చాయి. ప్రస్తుతం వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు బోరు బావుల కింద నాట్లు వేస్తున్నారు. మరికొంత మంది రైతులు పొలాల్లో విత్తనాలు విత్తడానికి తమ కాడెద్దులతో పొలం బాట పట్టి పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఈ వానకాలంలో ఇప్పటి వరకు 1,07,082 ఎకరాల్లో పత్తి, 24,840 ఎకరాల్లో సీడ్ పత్తి, 9066 ఎకరాల్లో కంది, 1000 ఎకరాల్లో మొక్క జొన్న పంటలు సాగు చేశారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటలు సా
కోడేరు, జూలై 21 : అల్ప పీడన ప్రభావంతో నా గర్కర్నూల్ జిల్లాలో రెండ్రోజులుగా ముసురు ను ంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వరుణుదేవుడి కరుణించకపోవడంతో మొన్నటి వరకు నీటితడులు అందక ఎండిపోయే దశలో ఉన్న వివిధ పంటలు వానల రాకతో కళకళలాడుతున్నాయి. రో హిణి కార్తెలో కురిసిన మోస్తరు వర్షానికి రైతులు పొలాల్లో పత్తి, మొక్కజొన్న, జొన్న, ఆముదం ఇతన విత్తనాలను విత్తారు. తర్వాత వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. కొన్ని చోట్ల పదునున్న భూముల్లో మొలకలు మొలకెత్తా యి.
తర్వాత వర్షం రాకపోవడంతో ఎండతీవ్రతతో మొక్కలు ఎండుముఖం పట్టాయి. దిగాలు చెందిన రైతులు నిత్యం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూశా రు. చివరకు తుఫాన్ పంటలకు ప్రాణం పోసింది. జిల్లాలో దాదాపు 30 వాతం మొట్ట పొలాల్లో విత్త నాలు విత్తారు. మృగశిర కార్తెలో ఆశించిన మేరకు వర్షాలు కురిస్తే కందులు ఆముదం, పెసర్లు, తదితర పంటలు వేయడానికి విత్తనాలను శుద్ధి చేసి ఉంచారు. రెండ్రోజులుగా కు రిసిన వర్షానికి పొలాల్లో విత్తనాలను వేస్తూ రైతులు బిజీబిజీగా కనిపించారు. పొలాల్లో వేసిన పంట చేలకు దంతెలు కొడుతున్నారు. కలుపు మొక్కల ను తొలగించే పనుల్లో రైతులు, వ్యవసాయ కూ లీలు నిమగ్నమయ్యారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఇదే సమయానికి పంట లు ఏపుగా పెరిగా యి. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితు ల కారణంగా సాగు పనులు ఆలస్య మయ్యాయి.
గత నెలలో కొద్దిపాటి వర్షం కురువగా జిల్లాలో ఆ వర్షానికి రైతులు మిరప, పత్తి, టమాట, మొక్కజొన్న, కందులు, వేరుశనగ పంటలు సాగు చేశారు. ఆ తర్వాత వరుణ దేవుడు మొఖం చాటేయడంతో రైతులు వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. మరి కొన్ని మొలకలు భూమిలోనే ఉండి పోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు కొంత ఊరట లభించింది.
రైతులు పొలంలో వేసిన మొలకలు ప్రస్తుతం మొలక ఎత్తడంతో రైతుల కళ్లలలో ఆనందం వెళ్లి విరిసింది. వర్షాలకు పొలం పదునుగా ఉండడంతో రైతులు ఎరువులు చల్లి విత్తనాలు విత్తడానికి తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు కురుస్తుండడంతో అటు రైతులు, కూలీలు పొలం పనుల్లో బిజీగా మారిపోయారు. ఎగువన వర్షాలు కురిసి జూరాలకు వరద నీరు వచ్చి చేరితే అటు జూరాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్ ద్వారా కాల్వకు నీరు వదిలితే రైతులు నాట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ వర్షాలు ఇలాగే కురిస్తే బాగుండేదని, పంటలకు మళ్లీ జీవం వస్తుందని వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వానదేవుడ్ని రైతులు వేడుకుంటున్నారు.