దామరగిద్ద, సెప్టెంబర్ 20 : యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వేరుశనగ విత్తనా ల కోసం మరోమారు బాధలు తప్పేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దామరగిద్ద మండల కేంద్రంలోని రైతువేదికలో 1,200 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు శనివారం ఉదయం 5గంటలకే పంపిణీ కేంద్రం వద్దకు తరలివచ్చారు.
తీరా విత్తనాలు పంపిణీ చేయడం లేదని తెలిసి నిట్టూర్చారు. కాగా, వేరుశనగ విత్తనాల పంపిణీ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి, విస్తరణ అధికారిని సంప్రదించడానికి ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.