జడ్చర్ల, నవంబర్ 30 : జడ్చర్ల మండలంలో వరికోతలు మొదలైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చ ర్ల మండలంలోని కోడ్గల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా.. నేటివరకు గింజకూడా కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని నెలరోజుల నుంచి తెలుపుతు న్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు లు ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి దాపురించింది.
జడ్చర్ల మండలంలో బాదేపల్లి, పెద్ద ఆదిరాల, పోలేపల్లి, కోడ్గల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను పేరుకే ఏర్పాటు చేశా రు కానీ అక్కడ గింజకూడా కొనుగోలు చేయలేదు. కేవలం బాదేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాత్రం పత్తిమార్కెట్యార్డులో ప్రారంభించి కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే పెద్ద ఆదిరాల, పోలేపల్లిలో కొనుగోళ్లు ఆల స్యం అవుతుండడంతో ఆయా గ్రామాల రైతులు తమతమ గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరైన సమయంలో ప్రారంభించక పోవడంతో బాదేపల్లి పత్తిమార్కెట్కు ధాన్యం తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. కోడ్గల్ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో రైతులు అక్కడే తమతమ ధాన్యం ఆరబెట్టి తూర్పుపట్టి ఉంచారు.
దాదాపు 20రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక ఫెంగాల్ తూఫాన్తో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుఫాను ప్రభావం ఇక్కడికి వచ్చే పరిస్థితి దాపురించి ఉం దని.. అది వస్తే ఆరుబయట ఉన్నధాన్యం కుప్పల పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడ్గల్ వద్ద దాదాపు 7వేల నుంచి 10వేల బస్తాలకు సంబంధించిన ధాన్యం కుప్పలు ఉన్నా యి. వర్షాలు వస్తే అవి తడిసిపోయే ప్రమాదం ఉంద ని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోడ్గల్లో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే వర్షాలకు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి కోతలై 15రోజులైంది. ధాన్యం కొనుగోలు చేస్తారని ఇక్కడ ఆరబెట్టి ఉంచాం. అధికారులు ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదు. దాదాపు 200బస్తాలకుపైగా ధాన్యం ఉన్నది. అన్నీ సరిగానే ఉన్నా కొనుగోలు చేయకపోవడం శోచనీయం. ఎన్నిరోజులని కాపలా ఉండాలా, అధికారులు స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి.
– రఘుమారెడ్డి, కోడ్గల్, జడ్చర్ల మండలం
దాదాపు 20రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టి ఇక్కడే కాపలాకాస్తున్నాం. ఏ అధికారి కూడా ఇక్కడకు వచ్చిన పాపానపోలేదు. ప్రభుత్వం మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తుందని.. బోనస్కూడా వస్తుందని అమ్మకుండా ఉన్నందుకు తగిన శాస్తి జరిగింది. ధాన్యానికి కాపలా కాయటమే పనిగా మారింది.
– నారాయణగౌడ్, కోడ్గల్ మండలం జడ్చర్ల